Nischalam Foundation in Telugu

Nischalam Foundation

నిశ్చలం ఫౌండేషన్

భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే!

సత్సంగత్వే నిస్సంగత్వం

నిత్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలతత్త్యం

నిశ్చలతత్త్యే జీవన్ముక్తి:

-ఆది శంకరాచార్య

ప్రకృతిలో అంతర్లీనంగా ఒక లయ వుంటుంది. ఆ శృతిబద్ధమైన లయాత్మకత సాకారస్థితే విశ్చలం! నిశ్చల స్థితి సాధిస్తేనే నిజజీవితంలో ముక్తి, ముక్తి అనేది చనిపోయాక సంభవించేదికాదు. బ్రతికుండగానే సంతరించుకునే సత్రియ. సూర్యోదయాలు, రుతువులు, గ్రహగతులు అన్నీ నిర్ణీత లయబద్ధత తోనే తమ ఉనికిని చాటుతూంటాయి.

సహప్రాణులతో సహా మనిషి జీవికకూ లయ అత్యంత అవసరం. మనిషి బహిర్ ప్రకృతికి, అం తర్ ప్రకృతికి నడుమ సామరస్యంతో కూడిన లయ ప్రతిఫలించాలి. అప్పుడు మాత్రమే సంఘర్షణ లేని ఏకత్వం సాధ్యం. ఈ అద్వైత పరిణామమే జీవన్ముక్తి.

ఈ అంతఃస్సూత్రమే ‘నిశ్చలం’ సేంద్రీయ ఉత్పత్తులకు ప్రేరణ. నిశ్చలం ఉత్పత్తులన్నీ ఆహారం ఔషధంగా భావించే రసాయనాలు లేని నేలతల్లి అమృత పదార్థాలు. రుచి శుచి శుభ్రతలతో కూడి నిఖార్సయిన ప్రమాణాలతో ఆయువును పెంచే అద్భుతసంబరాలు, కృత్రిమ రంగులు, నిల్వరసాయనాల కపటపు కల్తీరహిత ఖచ్చితమైన దిమసులు. విటమిన్లు ఖనిజలవణాలు నిండిన మెండైన మాంసకృత్తుల పసందైన వంటసరుకులు.

సుదీర్ఘ సమయ పరిశోధనలతో కాలపరీక్షకు నిలిచిన అసమాన ఆరోగ్య మందారాలు. రోజూ వండుకుతినే బియ్యం నుంచి మనకు నిత్యావసరాలైన కందిపప్పు, ఉద్దిపప్పు, ఉప్పు, బెల్లం, చక్కెర, వంటనూనెలు, జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో సహా సబ్బులు, చిరుతిండ్లు వరకు… దాదాపు 150 దాకా ఉత్పత్తులకు ‘నిశ్చలం’ ఒక నమ్మకమైన జవాబు.

నిశ్చలం తాత్విక భూమికకు ఒక ఆసక్తికర నేపథ్యం వుంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి వాసి గుణ అనే అన్నంగి గుణశేఖర్ రెడ్డి ఓ మధ్యతరగతి కుటుంబీకుడు.

ప్రాథమిక విద్య, హైస్కూలు, ఇంటర్ చదువులు స్వస్థలంలోనే పూర్తిచేసి వెల్లూరు జిల్లా వాకాడు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. 1997 సంవత్సరంలో సర్వీసు ఇంజనీర్ గా చెన్నై, హైదరాబాద్ లో ఉద్యోగం. కంప్యూటర్ కోర్సులయిన వైటుకే, మెయిన్ ఫ్రేమ్స్ శిక్షణ. రెండున్నరేండ్లు ఢిల్లీలో జాబ్. కంపెనీ వాళ్ళే 2000 సంవత్సరంలో ఇంగ్లాండ్ పంపించారు. 2007 సంవత్సరానికల్లా ఇంగ్లాడ్ పౌరసత్వం లభించింది. 2008వ సంవత్సరంలో అనుకోని సంఘటన…. ఆరోగ్యం కాప్త దెబ్బతినింది. దాంతో పలురకాల ప్రత్యామ్మాయ వైద్యవిధానాలు, పద్ధతులను అవలంబిస్తూ అవారోగ్యం నుంచి కోలుకోవడం జరిగింది. “విదేశంలో డబ్బుల బ్యాంకు ఖాతా పెరుగుతుందేమో గానీ ఆరోగ్యం ఆకౌంట్  పెరగదు” అన్న సత్యం అనుభవపూర్వకంగా అర్థమయ్యింది. “భూమితల్లితో అనుసంధావమైన వ్యవసాయం మాత్రమే తనకు తగిన జీవిక” అని మనస్సాక్షి మాట వినిపించింది.

అంతే! 2011 సంవత్సరం మూటాముల్లె సర్దుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణం. తొలుత కడపజిల్లా మైదుకూరు దగ్గర ఓ కుగ్రామంలో నివాసం వుంటూ ఒక పాఠశాలను ఎన్నుకుని సేంద్రీయ పదార్థాలతో పిల్లలకు పోషకాహారం కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

సేంద్రీయ సాగు వ్యవసాయ విధానం పరిచయం కావడం.. ప్రకృతి వ్యవసాయంలోకి ప్రవేశించడం సంభవించాయి.

ఈ నేపథ్యంలో 2011-2017 సం॥ నడుమ మదనపల్లె దగ్గర ఒక ప్రకృతి వ్యవసాయకుటుంబంతో స్నేహం కుదిరింది. వారి వ్యవసాయ క్షేత్రంలో స్వచ్చందంగా పనిచేయడం మొదలైంది.

కరవు పరిస్థితులు ఏర్పడినపుడు అక్కడి వ్యవసాయకూలీల జీవనోపాధికై కొన్ని కొత్త పథకాలు చేపట్టాల్సి వచ్చింది. వెయ్యి రూపాయల కనీస పెట్టుబడితో ప్రారంభిచబడ్డ ఉత్పత్తుల అమ్మకం అంచలంచెలుగా రెండుకోట్ల వరకు టర్నోవర్ సాధించింది. ఒక ఉత్పత్తి కాస్తా క్రమంగా వంద ఉత్పత్తుల స్థాయిని అందుకుంది.

ఇంత చేస్తున్నా అంతరంగంలో ఇంకా ఏదో అలజడి! అసంతృప్తికి తెలీని కొరత….

ఈ క్రమంలో 2016-2017 సం॥ ఆధ్యాత్మిక రంగం వైపు మనసు మళ్ళింది. దైవత్వాన్ని అందుకోడానికి ఆరాటం మొదలైంది. మిత్రులతో కలిసి కాశీ, శ్రీశైలం, పంచభూతలింగాల క్షేత్ర దర్శనం, గోదావరి నదీమతల్లి జన్మస్థానమైన వాసిక్ త్రయ్యంబకమ్ యాత్ర, పుష్కరాలు, కుంభమేళాకు హాజరు

2017 సం॥ ఆగస్టులో చేసిన కైలాస మానససరోవర యాత్ర తవ జీవితంలో మేలిమలుపు. కైలాస శిఖర పరిక్రమానంతరం తెల్లవారుఝాము బ్రహ్మ మూహూర్తాన ఓ విడిది గదిలో ధ్యానమగ్నమై వుండగా తన హృదయాకాశంలో అఖండమైన తేజోరాశి జ్వాజ్వల్యమానంగా ప్రకాశించింది. శక్తిపాతం ఆవహించింది. నిర్వికల్ప సమాధి స్థితి సంభవించింది.

అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో వున్నారో తెలీదు. ఆ తరువాత ఎప్పటికో ఒక నిశ్చలత్యం పొందిన దివ్యానుభూతి.

అదే ధ్యాన మనఃస్థితి ఆవరించివుండగా తిరిగి మదనపల్లెకి వచ్చీరాగానే ‘నిశ్చలం ఫౌండేషన్’ కు నాందీ ప్రస్తావన… సమాజ శ్రేయస్సుకు ఉపకరించే ఒక సదవగాహనాకృత్యం పురుడుపోసుకుంది.

తొలికార్యక్రమంగా గ్రామీణ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం క్రింద 15 పాఠశాలల్లో సుమారు 1500ల మంది పిల్లలకి పోషకాహారం పంపిణీ ప్రారంభమైంది. తను చేస్తున్న పనికి సంఘీభావంగా కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులు తలా ఓ చెయ్యి వేశారు. ఈ క్రమంలో ‘నిశ్చలం’ఉత్పత్తులకు రూపకల్పన జరిగింది.

పుట్టిన ఊరును మించిన స్వర్గం ఎక్కడుంటుంది…? అందుకే స్వస్థలం తిరుపతికి దగ్గరగా గల రాయలచెరువు మార్గంలోని కొండకోనల రమణీయ బలిజపల్లె ‘విశ్చలం’కి వెలవుగా నిలిచింది.

2019 సం॥ కల్లా మదనపల్లె నుంచి మకాం బలిజపల్లెకి బదిలీ అయ్యింది.. మొదట్లో రమారమి రెండు ఎకరాల సుక్షేత్రంలో సేంద్రీయ సాగు మొలకెత్తింది. తొలిదశలో వర్షపునీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటింపు, పరిమిత యాంత్రీకరణ, సేంద్రియ ఉత్తత్తుల రూపకల్పన, ప్యాకింగ్, అమ్మకాలు…ఆరంగేట్రం చేశాయి.

నిశ్చలం ఫౌండేషన్ కు సంబంధించి ధాన్యం, యోగ, గ్రామీణ విద్య తదితర ఇతరత్రా కార్యక్రమాలు సైతం విదానంగా నిలదొక్కుకోసాగాయి.

నిశ్చలం సిరి ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి పైసా ఫౌండేషన్ కార్చాచరణకు వినియోగంచేట్టు తీర్మానమయ్యింది.

తన జీవనప్రస్థానంలో గుణకి భార్య శ్రీమతి రజని, కూతురు అర్పితల భాగస్వామ్యం మరువలేనిది. వారి అండదండలు, ప్రోత్సాహం ‘నిశ్చలం’ కార్యవిధులకు ఎంతో ఊతంగా నిలిచాయి.

పుష్పించే భవిష్యత్తు – ఆ పరీమళాలు ఆఘ్రాణించాలనుకునే వారందరిదీను- నిశ్చలం.

రండి! చేతులు కలపండి!

ఆరోగ్యం! ఆత్మానందం! సంతృప్తి! సుహృధ్భావం!

సృజనాత్మకత…కలగలిస్తే నిశ్చలం!

ఇక మన జయం నిశ్చయం!

నిశ్చలం ఫౌండేషన్ ఓ జీవన సౌరభం.

నిశ్చలం ఫౌండేషన్ మీ ఆర్థికసుస్థిరతకు అక్షరమాల,

జీవిత పరమార్థం కై పరితపించే ప్రతి ఒక్కరికీ నిశ్చలం ఫౌండేషన్ ఒక ఒయాసిస్.

Slogans

శరీరానికే కాదు ఆత్మపోషణకీ ఉపకరించే అత్యుత్తమ ఆహారం ‘నిశ్చలం’

‘నిశ్చలం’తో ఇక మీ ఆరోగ్యానికి నిశ్చింత!

నిశ్చలం ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆయురారోగ్యాలకు పూచీ.. వుండవిక రోగాలురొష్టుల పేచీ

సేంద్రీయం మన సంస్కృ్కతి

సేంద్రీయం మన సంప్రదాయం

సేంద్రీయంసరుకుల ‘నిశ్చలం’ ఉత్పత్తుల వాడకం మన సదాచారం

జీవన ప్రమాణానికి, పరమార్థానికి పర్యాయపదం నిశ్చలం.

జీవన్ముక్తికి నిశ్చలం సేంద్రీయ ఉత్పత్తులు.

తినే తిండే ఔషధమై ప్రాణం పోసేవి నిశ్చలం సేంద్రీయ ఉత్పత్తులు.

సేంద్రీయం – ధ్యానం – యోగం- నిశ్చలం

ప్రకృతిసిద్ధ ఆహార విభిన్నతే – జీవవైవిధ్యం

పర్యావరణహిత ఉత్పత్తుల ఉత్పాదకతే నిశ్చలం

నిశ్చలం ఒక తాత్విక చింతన

జీవన ప్రమాణ హేతువు